కనగానపల్లి మండలం పాతపాళ్యం గ్రామంలో 45 లక్షల రూపాయల NREGS నిధులతో నిర్మించిన సీసీ రోడ్లను రాప్తాడు ఎమ్మెల్యే శ్రీమతి పరిటాల సునీతమ్మ గారు ప్రారంభించారు. అనంతరం ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఇన్ఫిన్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 20 మంది మహిళలకు 50 శాతం సబ్సిడీతో కుట్టుమిషన్లను పంపిణీ చేశారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ వేపకుంట సుధాకర్ నాయుడు, మండల కన్వీనర్ యాతం పోతలయ్య, మండల నాయకులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు ఒకేసారి అమలు చేయడం ద్వారా గ్రామాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని నాయకులు తెలిపారు.
Fetching videos...
Fetching latest news...
No trending news