పేదల సొంతింటి కలను సాకారం చేయడం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని రంపచోడవరం ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్పర్సన్ మిరియాల శిరీషాదేవి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రెండో విడతగా ఏకకాలంలో 2.5 లక్షల గృహప్రవేశాలను నిర్వహించడం ద్వారా పేదల జీవితాల్లో ఒక కొత్త వెలుగును తీసుకొచ్చినట్లు ఆమె పేర్కొన్నారు.

రంపచోడవరం మండలం భీరంపల్లి గ్రామంలో జరిగిన సామూహిక గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే, పేదల ఆనందాన్ని ప్రత్యక్షంగా చూసి సంతోషం వ్యక్తం చేశారు. పోలవరం జిల్లాలో మొత్తం 391 గృహాలను లబ్ధిదారులకు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్ చైర్మన్ చోళ్ళ బొజ్జిరెడ్డి, ఐటిడిఎ పీవో బచ్చు స్మరణ రాజ్ పాల్గొని గృహాలను ప్రారంభించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 21 నెలల వ్యవధిలో రెండోసారి ఇళ్ల పంపిణీ చేపట్టడం విశేషమని ఆమె చెప్పారు. గత సంవత్సరం నవంబర్లో 3 లక్షల ఇళ్లను పేదలకు అందజేసిన ప్రభుత్వం, ప్రస్తుతం మరో 2.5 లక్షల గృహాలను అందించి మొత్తం 5.50 లక్షల ఇళ్ల పంపిణీ పూర్తి చేసిన ఘనతను సాధించిందని వెల్లడించారు.

ఈ గృహాల ద్వారా పేద కుటుంబాలు సురక్షిత నివాసం పొందడమే కాకుండా, గౌరవప్రదమైన జీవనం వైపు అడుగులు వేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రతి కుటుంబం సొంత ఇల్లు కలిగి ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం పథకాలను అమలు చేస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు అందే వరకు ఈ ప్రయత్నం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, గృహ నిర్మాణంతో పాటు మౌలిక వసతులు, జీవనోపాధి అవకాశాలను కూడా కల్పిస్తూ సమగ్ర అభివృద్ధి దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే వివరించారు.
Fetching videos...
Fetching latest news...
No trending news