బెల్లంపల్లి పట్టణంలో ఫుట్‌పాత్‌లు, ప్రజలు నడిచే మార్గాలపై జరుగుతున్న ఆక్రమణలను తొలగించాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్‌కు కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకుడు, రేవంత్ రెడ్డి సైన్యం సోషల్ మీడియా కార్యదర్శి కొలిపాక శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. ఫుట్‌పాత్‌పై నడవడం ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొన్న నేపథ్యంలో బెల్లంపల్లిలో ఆ ఆదేశాలను అమలు చేయాలని ఆయన కోరారు.
పట్టణంలోని ప్రధాన రహదారులు, ఫుట్‌పాత్‌లు మరియు ప్రజలు నడిచే మార్గాలను కొందరు వ్యాపారులు, షాపుల యజమానులు ఆక్రమించి అద్దెకు ఇస్తున్నారని ఆరోపించారు. ఫుట్‌పాత్‌లపై ద్విచక్ర వాహనాలు, కార్లు నిలిపివేయడం వల్ల పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఇళ్లు, దుకాణాలు ప్రజా మార్గాలను ఆక్రమిస్తూ నిర్మాణాలు చేపట్టడం వల్ల రాకపోకలకు ఆటంకం కలుగుతోందని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గతంలో సమర్పించిన వినతిపత్రం ఆధారంగా తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించిన నేపథ్యంలో, ఇప్పుడు బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. ముఖ్యంగా 34వ వార్డు, 18వ వార్డు మరియు కాంట్రాక్ట్ బస్తీ పరిసర ప్రాంతాల్లో ప్రజలు నడిచే మార్గాలపై ఉన్న ఆక్రమణలను తొలగించాలని విజ్ఞప్తి చేశారు.
ఫుట్‌పాత్ స్థలాలను అక్రమంగా అద్దెకు ఇచ్చిన వారిపై మున్సిపల్ చట్టాల ప్రకారం జరిమానాలు విధించాలని, ప్రజా హక్కులను పరిరక్షించే దిశగా అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. రాజకీయం లేదా ఇతర ఒత్తిళ్లకు లోనుకాకుండా రాజ్యాంగంలోని సమానత్వ హక్కు, జీవన హక్కు స్ఫూర్తికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
పాదచారులకు సురక్షితంగా నడిచే అవకాశం కల్పించేందుకు ఫుట్‌పాత్‌లను పూర్తిగా ఆక్రమణల నుంచి విముక్తం చేయాలని, లేదంటే చట్టపరమైన మార్గాలను ఆశ్రయిస్తామని కొలిపాక శ్రీనివాస్ హెచ్చరించారు. ప్రజల హక్కుల పరిరక్షణ కోసం ఈ అంశంపై మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.
Fetching videos...
Fetching latest news...
No trending news