పోలవరం జిల్లా రంపచోడవరం ఐటిడిఏ కార్యాలయంలో నిర్వహించిన పిజిఆర్ఎస్ సమావేశంలో మొత్తం 150 అర్జీలు స్వీకరించినట్లు జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ తెలిపారు. రెవెన్యూ క్లినిక్‌లో మరో 2 అర్జీలు అందాయని చెప్పారు. ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతతో, జవాబుదారీతనంతో వ్యవహరించాలని, క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆయన ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేశారు.
పెండింగ్ అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచిస్తూ, అధికారుల లాగిన్‌లో ఇంకా 171 అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. వాటిలో వాటర్ రిసోర్సెస్, డీఆర్డీఏ, పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించినవి ఉన్నాయని పేర్కొన్నారు. కొన్ని 24 గంటల్లో, మరికొన్ని 24–48 గంటల్లో పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీల పరిష్కారంపై సంతృప్తి స్థాయిని ఆడిట్ చేయాలని, SLA పరిమితులు దాటకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను 100 శాతం ప్రజల సంతృప్తితో అమలు చేయాలని, ఫీల్డ్ అధికారులు నేరుగా సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. పలు అర్జీలు స్వీకరించబడి, దివ్యాంగ పెన్షన్, భూ సమస్యలు, చట్టపరమైన అంశాలపై ప్రజలు వినతులు సమర్పించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news