పోలవరం జిల్లా సమగ్ర అభివృద్ధికి పరిపాలన సహకారం అత్యవసరమని రంపచోడవరం ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్పర్సన్ మిరియాల శిరీషాదేవి అన్నారు. రంపచోడవరం కలెక్టర్ కార్యాలయంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.
ఈ సందర్భంగా గిరిజన ప్రాంతాల్లో నెలకొన్న పలు కీలక సమస్యలను ఆమె కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా విద్య, వైద్యం, మౌలిక వసతుల అభివృద్ధి, ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో ఉన్న లోపాలు, గిరిజన ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఆర్థికాభివృద్ధి వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.
అలాగే కుల ధృవీకరణ పత్రాల మంజూరులో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి, వాటికి తక్షణ పరిష్కారం చూపాలని కోరారు. ఈ అంశాలపై స్పందించిన కలెక్టర్ దినేష్ కుమార్, సంబంధిత అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఐటిడిఎ పీవో బచ్చు స్మరణ రాజ్, రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు గొర్లె సునీత, తెలుగు యువత అధ్యక్షుడు మఠం విజయ్ భాస్కర్, అరకు పార్లమెంట్ ఉపాధ్యక్షుడు అడబాల బాపిరాజు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి స్వప్న కుమారి, సీనియర్ నాయకుడు గణజాల తాతారావు తదితరులు పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news