పార్వతీపురం మండలంలో ప్రభుత్వ భూములు, చెరువులు పెద్దఎత్తున ఆక్రమణకు గురయ్యాయని సీపీఐ (ఎంఎల్) రెడ్ స్టార్ జిల్లా కార్యదర్శి తోట జీవన్న ఆరోపించారు. ఈ విషయంపై తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ నాగరాజుకు మెమోరాండం అందజేశారు.
సర్వే నంబర్లలో ఉన్న మున్సిపల్ స్థలాలు, చెరువులు ఆక్రమించి పత్రాలు తారుమారు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తక్షణమే ఆక్రమణకు గురైన భూములను స్వాధీనం చేసుకుని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాసి, పీడీ యాక్ట్ కింద అరెస్టులు చేపట్టేలా ఉద్యమిస్తామని హెచ్చరించారు.
Fetching videos...
Fetching latest news...
No trending news