గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా మరోసారి తన స్పష్టమైన అభిప్రాయాలతో చర్చనీయాంశంగా మారారు. ఇటీవల నిర్వహించిన క్యాన్స్ లయన్స్ ఈవెంట్లో పాల్గొన్న ఆమె ఇంటి పనులు, జెండర్ రోల్స్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వంట చేయడం, గిన్నెలు తోమడం, ఇల్లు శుభ్రం చేయడం వంటి పనులు కేవలం మహిళల బాధ్యతగా చూడటం సరైన ఆలోచన కాదని స్పష్టం చేశారు. ఇంటి పనులు ఆడ, మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పంచుకోవాల్సిన బాధ్యత అని పేర్కొన్నారు. ఈ పనులను మహిళలకే పరిమితం చేయడం సమానత్వానికి విరుద్ధమని, వాటిని జెండర్‌తో కాకుండా వ్యక్తిగత బాధ్యతగా చూడాలని సూచించారు. అలాగే టెక్నాలజీ అభివృద్ధితో కంటెంట్ క్రియేషన్‌కు ఎన్నో అవకాశాలు వచ్చాయని, యూట్యూబ్ వంటి వేదికలు కొత్త ప్రతిభకు మార్గం చూపుతున్నాయని అన్నారు. ప్రస్తుతం ప్రియాంక చోప్రా రాజమౌళి-మహేశ్ బాబు కాంబినేషన్లో రూపొందుతున్న 'వారణాసి' చిత్రంతో భారతీయ సినీ ప్రేక్షకులను మరోసారి అలరించేందుకు సిద్ధమవుతున్నారు. అదే సమయంలో హాలీవుడ్‌లోనూ పలు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులతో బిజీగా కొనసాగుతున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news