పంజాబ్‌లో భద్రతా బలగాలు ఒక పెద్ద ఉగ్ర కుట్రను భగ్నం చేశాయి. పాకిస్థాన్‌కు చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) ఏజెంట్‌ను పోలీసులు అరెస్ట్ చేయడంతో పాటు అతని వద్ద నుంచి నాలుగు అత్యాధునిక హ్యాండ్ గ్రనేడ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి.
ప్రాథమిక విచారణలో, పాకిస్థాన్ నుంచి డ్రోన్ల ద్వారా ఈ ఆయుధాలు భారత భూభాగంలోకి తరలించబడినట్లు అధికారులు గుర్తించారు. రద్దీ ప్రాంతాల్లో భారీ దాడులు జరపాలని ఈ నెట్వర్క్ ప్రణాళిక వేసినట్లు దర్యాప్తులో బయటపడింది. ఈ కుట్ర వెనుక మరింత పెద్ద ఉగ్ర నెట్వర్క్ ఉండవచ్చని భద్రతా సంస్థలు అనుమానిస్తున్నాయి.
అరెస్ట్ అనంతరం పంజాబ్‌తో పాటు సరిహద్దు రాష్ట్రాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. కీలక ప్రాంతాల్లో తనిఖీలు పెంచి అనుమానాస్పద కదలికలపై నిఘా ఉంచారు. అలాగే ఈ కేసుతో సంబంధం ఉన్న ఇతర వ్యక్తుల కోసం విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ప్రస్తుతం అధికారులు ఈ ఉగ్ర కుట్ర మూలాలను పూర్తిగా వెలికితీయడానికి లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. దేశ భద్రతకు సంబంధించిన ఈ కేసును అత్యంత సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం.
Fetching videos...
Fetching latest news...
No trending news