ఎప్పుడూ ఒకే విధంగా మటన్ కర్రీ వండి బోర్ కొట్టిందా? అయితే ఈసారి రాజస్థానీ స్టైల్లో మటన్ కర్రీ తయారు చేసి కొత్త రుచిని ఆస్వాదించండి. ఆవ నూనెలో షాజీరా, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, స్టార్ అనాసా, ఉల్లిపాయలు వంటి మసాలాలను బాగా వేయించి, అందులో శుభ్రం చేసిన మటన్ వేసి నెమ్మదిగా ఉడికించాలి. మొదట నూనెలోనే మటన్ కొంతవరకు ఉడికిన తర్వాత వేడి నీరు, పెరుగు, కారం, గరం మసాలా వేసి తక్కువ మంటపై ముక్క మెత్తబడే వరకు ఉడికించాలి. చివరగా ఉప్పు, కొత్తిమీర, పుదీనా వేసి మరికొద్దిసేపు మగ్గిస్తే చిక్కటి గ్రేవీతో రుచికరమైన రాజస్థానీ మటన్ కర్రీ సిద్ధమవుతుంది. ఈ కర్రీని వేడి అన్నం, రోటీ, చపాతీ లేదా నాన్తో వడ్డిస్తే అద్భుతమైన రుచి అందిస్తుంది. వీకెండ్ స్పెషల్గా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ మటన్ కర్రీని సులభంగా తయారు చేసి కుటుంబ సభ్యులతో ఆస్వాదించవచ్చు.
Fetching videos...
Fetching latest news...
No trending news