ఉదయగిరి ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో నిర్వహించిన వైద్య శిబిరాన్ని ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ తెలుగు యువత సోషల్ మీడియా కోఆర్డినేటర్ మార్నేని రామకృష్ణ ఆయనను శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు చేస్తున్న కృషికి కృతజ్ఞతలు తెలిపారు.
గ్రామీణ ప్రాంతాలకు అదనపు బస్సు సౌకర్యాలు అందించడం వల్ల విద్యార్థులు, ఉద్యోగులు, సాధారణ ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మార్నేని రామకృష్ణ పేర్కొన్నారు. ప్రజల రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరిన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు.
ఈ సందర్భంగా ఆత్మకూరు నుంచి చాకలకొండ మీదుగా పామూరు వరకు కొత్త బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరుతూ సురేష్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ మార్గంలో బస్సు సౌకర్యం కల్పిస్తే పరిసర గ్రామాల ప్రజలకు ప్రయాణ సౌలభ్యం పెరుగుతుందని వివరించారు.
వినతిపై స్పందించిన ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ప్రయాణికుల అవసరాలను పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మల్లంపాటి సుదర్శన్, చల్లా బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రజా అవసరాలకు అనుగుణంగా రవాణా సేవలను మరింత విస్తరించేందుకు కృషి చేస్తామని నాయకులు తెలిపారు.
Fetching videos...
Fetching latest news...
No trending news