చీరాల మాజీ ఎమ్మెల్యే, ప్రజానాయకుడు దివంగత సజ్జ చంద్రమౌళి 99వ జయంతి వేడుకలు చీరాలలో ఘనంగా నిర్వహించారు. స్థానిక గడియార స్తంభం సెంటర్లోని ఆయన విగ్రహానికి చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య, ఆప్కో చైర్పర్సన్ సజ్జ హైమలత, యువ నాయకుడు మద్దులూరి గౌరీ అమర్నాథ్తో పాటు కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొని సజ్జ చంద్రమౌళి సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య మాట్లాడుతూ, ప్రజల కోసం జీవితాంతం అంకితభావంతో పనిచేసిన నాయకుల్లో సజ్జ చంద్రమౌళి ఒకరని కొనియాడారు. చీరాల నియోజకవర్గ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. రాజకీయాల్లో విలువలు, నిజాయితీ, నిబద్ధతతో ప్రజల విశ్వాసాన్ని సంపాదించిన నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉందని పేర్కొన్నారు. సజ్జ చంద్రమౌళి ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ప్రజా సేవే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
జయంతి కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, ప్రజాప్రతినిధులు సజ్జ చంద్రమౌళితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన ప్రజల కోసం చేసిన సేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు. చీరాల అభివృద్ధికి ఆయన అందించిన కృషి ఎప్పటికీ మరువలేనిదని పలువురు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి చెందిన నాయకులు, మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయంతి వేడుకలను విజయవంతం చేశారు. సజ్జ చంద్రమౌళి సేవలు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని పలువురు పేర్కొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news