ప్రపంచ సినీ ప్రేక్షకులను తన అద్భుత నటనతో అలరించిన న్యూజిలాండ్‌కు చెందిన ప్రముఖ నటుడు సామ్ నీల్ కన్నుమూశారు. జురాసిక్ పార్క్, ది పియానో, పీకీ బ్లైండర్స్ వంటి చిత్రాలు, టెలివిజన్ సిరీస్‌లలో తన విశిష్ట నటనతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆయన న్యుమోనియా కారణంగా తుదిశ్వాస విడిచినట్లు ఆయన ఏజెంట్ అధికారికంగా ధృవీకరించారు. ఆయన మరణవార్తతో ప్రపంచ సినీ పరిశ్రమ, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు సామ్ నీల్ వయస్సు 78 సంవత్సరాలు. ఆయన ఇటీవల రక్త క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్నట్లు ప్రకటించిన కొద్ది నెలలకే న్యుమోనియా బారిన పడి మరణించారు. గతంలో ఆయనకు అరుదైన రకం నాన్-హాడ్జ్కిన్ లింఫోమా (ఆంజియోఇమ్యునోబ్లాస్టిక్ టీ-సెల్ లింఫోమా) ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆధునిక CAR-T సెల్ థెరపీ ద్వారా చికిత్స పొంది క్యాన్సర్ నుంచి బయటపడ్డారని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. అయితే ఆ చికిత్సల ప్రభావంతో శరీర రోగనిరోధక శక్తి బలహీనపడటంతో న్యుమోనియా తీవ్రరూపం దాల్చినట్లు ఆయన ప్రతినిధి వివరించారు.
సామ్ నీల్ మరణానికి సంబంధించిన పలు తప్పుడు కథనాలు సోషల్ మీడియాలో ప్రచారంలోకి రావడంతో, ఆయన ఏజెంట్ ఫిలిప్ గ్రెన్జ్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. అందులో సామ్ నీల్ న్యుమోనియాతో మరణించారని, క్యాన్సర్ వల్ల కాదని స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాతే ఈ వివరాలను వెల్లడిస్తున్నట్లు పేర్కొంటూ, ప్రజలు అసత్య ప్రచారాలను నమ్మవద్దని కోరారు.
సామ్ నీల్ సినీ జీవితంలో అత్యంత గుర్తింపు తెచ్చిన పాత్ర 1993లో విడుదలైన ‘జురాసిక్ పార్క్’ చిత్రంలోని డాక్టర్ అలన్ గ్రాంట్ పాత్ర. ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధించగా, ఆయన నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం ది లాస్ట్ వరల్డ్: జురాసిక్ పార్క్, జురాసిక్ పార్క్ III, జురాసిక్ వరల్డ్ డొమినియన్ చిత్రాల్లో కూడా ఆయన అదే పాత్రను పోషించి కొత్త తరానికి కూడా సుపరిచితుడయ్యారు.
Fetching videos...
Fetching latest news...
No trending news