ఫిలిప్పీన్స్ రాజకీయాల్లో అత్యంత కీలక పరిణామంగా భావిస్తున్న ఉపాధ్యక్షురాలు సారా దుటెర్టేపై అభిశంసన విచారణకు దేశ సెనేట్ సిద్ధమైంది. అధికారంలో ఉన్న ఉపాధ్యక్షుడిపై ఈ తరహా విచారణ జరగడం ఫిలిప్పీన్స్ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ విచారణ నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు పలువురిని అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. రాజకీయ ఉద్రిక్తతల మధ్య ప్రారంభమవుతున్న ఈ విచారణపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆసక్తి నెలకొంది. మాజీ అధ్యక్షుడు రోడ్రిగో దుటెర్టే కుమార్తె అయిన 48 ఏళ్ల సారా దుటెర్టేపై అవినీతి ఆరోపణలతో పాటు ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ "బోంగ్బోంగ్" మార్కోస్ను హత్య చేయిస్తానని బహిరంగంగా బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ రెండు ప్రధాన ఆరోపణల ఆధారంగానే ఆమెపై అభిశంసన ప్రక్రియ చేపట్టబడింది. అయితే ఈ ఆరోపణలను సారా దుటెర్టే పూర్తిగా ఖండిస్తూ, ఇవన్నీ రాజకీయ వేధింపుల్లో భాగమేనని పేర్కొన్నారు సారా దుటెర్టే, అధ్యక్షుడు బోంగ్బోంగ్ మార్కోస్ మధ్య గత కొన్నేళ్లుగా తీవ్ర రాజకీయ విభేదాలు కొనసాగుతున్నాయి. ప్రారంభంలో ఒకే రాజకీయ కూటమిలో కలిసి పనిచేసిన ఈ ఇద్దరు నేతల మధ్య తరువాత విభేదాలు మరింత ముదిరాయి. పరస్పర విమర్శలు, ఆరోపణలు, రాజకీయ పోటీ కారణంగా ఈ విభేదాలు దేశ రాజకీయాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారాయి.
ప్రస్తుతం జరగనున్న అభిశంసన విచారణ సారా దుటెర్టే రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే కీలక ఘట్టంగా భావిస్తున్నారు. ఈ విచారణలో ఆమె దోషిగా తేలితే ఉపాధ్యక్ష పదవిని కోల్పోవడంతో పాటు 2028లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కూడా కోల్పోతారు. దీంతో ఈ విచారణ ఫలితం దేశ భవిష్యత్ రాజకీయ సమీకరణాలపై కూడా గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది.
Fetching videos...
Fetching latest news...
No trending news