రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసులో ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ కోసం పోలీసులు విస్తృత గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ప్రత్యేక బృందాల సంఖ్యను పెంచి రాష్ట్రవ్యాప్తంగా నిఘాను మరింత కట్టుదిట్టం చేశారు. నిందితుడి కదలికలను గుర్తించేందుకు అతడు ఉపయోగించిన సిమ్ కార్డులు, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్ల సీసీటీవీ దృశ్యాలను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు పరారై ఉండే అవకాశాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని కర్ణాటక సహా పలు ప్రాంతాలకు వెళ్లే మార్గాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. జాతీయ రహదారుల వెంట ఉన్న హోటళ్లు, దాబాలు, లాడ్జీలలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు.
దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం, తనపై నమోదైన పోక్సో కేసుపై కక్ష పెంచుకున్న రాజ్‌కుమార్ మొదట బాలిక తల్లి, నానమ్మలను కత్తితో దారుణంగా హత్య చేశాడు. అనంతరం బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి గొంతుకోసి చంపినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడితో ఆగకుండా ఇంటికి వెళ్లి తన భార్యతో పాటు నిద్రలో ఉన్న ఇద్దరు చిన్నారులను కూడా కిరాతకంగా హతమార్చాడు. కేవలం అరగంట వ్యవధిలో మూడు వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు మహిళలు, ఒక బాలిక, ఇద్దరు చిన్నారులను పొట్టనబెట్టుకోవడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
ఈ ఘటనపై ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుండగా, నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పరారీలో ఉన్న రాజ్‌కుమార్‌ను పట్టించేవారికి రూ.2 లక్షల నగదు బహుమతి ప్రకటించారు. కేసు నిర్వహణలో నిర్లక్ష్యం ఆరోపణల నేపథ్యంలో షాబాద్ ఎస్సై రమేశ్‌ను కూడా ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. నిందితుడి అరెస్టు కోసం పోలీసుల ప్రత్యేక బృందాలు రాత్రింబవళ్లు గాలింపు కొనసాగిస్తున్నాయి.
Fetching videos...
Fetching latest news...
No trending news