స్మార్ట్ఫోన్ల నుంచి వచ్చే పుష్ నోటిఫికేషన్లు కేవలం దృష్టిని ఆకర్షించడానికే కాకుండా మానసిక ఆరోగ్యం, పనితీరుపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. సగటున ఒక వ్యక్తికి రోజుకు 46కుపైగా నోటిఫికేషన్లు వస్తుండగా, అంటే మేల్కొని ఉన్న సమయంలో దాదాపు ప్రతి 20 నిమిషాలకు ఒకసారి ఫోన్ దృష్టిని మరల్చుతోంది. ఈ నిరంతర అంతరాయాలు ఒత్తిడిని పెంచడమే కాకుండా ఏకాగ్రత, ఉత్పాదకతను తగ్గిస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాదు, వాహనం నడుపుతున్న సమయంలో మొబైల్ నోటిఫికేషన్ల వల్ల ఏర్పడే దృష్టి మరలింపు ప్రమాదకర పరిణామాలకు దారితీస్తోంది. ఆస్ట్రేలియాలో ప్రతి సంవత్సరం ఫోన్ వల్ల ఏర్పడే డిస్ట్రాక్షన్ కారణంగా సుమారు 29 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. అవసరం లేని నోటిఫికేషన్లను నిలిపివేయడం, డ్రైవింగ్ సమయంలో ఫోన్కు దూరంగా ఉండడం, డిజిటల్ వినియోగాన్ని నియంత్రించడం ద్వారా ఒత్తిడిని తగ్గించడంతో పాటు ప్రమాదాలను కూడా నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news