శృంగవరపుకోట నియోజకవర్గంలోని కొత్తవలస మండల కేంద్రంలో నిర్వహించిన వారపు సంత వేలం వివాదాస్పదంగా మారింది. జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో 2026-27 సంవత్సరానికి ఆశీల వసూళ్ల కోసం నిర్వహించిన ఈ వేలంలో సిండికేట్ ఏర్పడి ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే తక్కువకు వేలం కుదిరిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన రూ.7,73,900 ధరకు బదులుగా, సిండికేట్ కారణంగా కేవలం రూ.7,47,570కు వేలం ఖాయం కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ వేలం ప్రక్రియను జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ ఆర్ వెంకట రామన్ పర్యవేక్షించగా, సీఈఓ సమక్షంలోనే ఈ వ్యవహారం జరిగిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వేలంలో పాల్గొన్న కొందరు పాటదారులు ముందుగానే సిండికేట్ అయ్యి పోటీని తగ్గించారని, దీంతో ప్రభుత్వానికి ఆదాయం నష్టపోయిందని ఆరోపిస్తున్నారు. అయితే ఈ అంశంపై అధికారులు స్పందించకపోవడం మరింత అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనపై పారదర్శక దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news