2029 నాటికి ఆంధ్రప్రదేశ్లో ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు కల్పించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం గృహ నిర్మాణ కార్యక్రమాన్ని వేగంగా అమలు చేస్తోంది. మొదటి విడతలో 2025 నవంబర్ 12న 3,00,192 ఇళ్లను పంపిణీ చేయగా, రెండో విడతలో భాగంగా మరో 2,50,893 ఇళ్లను ఈరోజు లబ్ధిదారులకు అందజేస్తోంది.
ఈ కార్యక్రమంలో భాగంగా పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లిలో నిర్వహించిన గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే కలికిరి మురళి మోహన్ పాల్గొన్నారు. లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశంలో పాల్గొని వారికి అభినందనలు తెలిపారు.
పేదలకు సొంత ఇల్లు కల్పించడం ద్వారా వారి జీవితాల్లో స్థిరత్వం, భద్రత కలుగుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ఈ సంక్షేమ కార్యక్రమాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాయని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, స్థానిక నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news