ప్రపంచ పాప్ సంగీత దిగ్గజం టేలర్ స్విఫ్ట్, అమెరికన్ ఫుట్‌బాల్ స్టార్ ట్రావిస్ కెల్సీ వివాహ వేడుక ప్రపంచవ్యాప్తంగా అభిమానుల దృష్టిని ఆకర్షించింది. అత్యంత గోప్యంగా నిర్వహించిన ఈ వివాహం జరిగిన రెండు రోజుల తర్వాత అతిథుల నుంచి ఒక్కొక్కటిగా వెలువడుతున్న స్పందనలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. "అద్భుతమైన రాత్రి", "ప్రపంచంలోనే గొప్ప హ్యాంగోవర్" వంటి వ్యాఖ్యలతో పలువురు ప్రముఖులు ఈ వేడుకపై తమ అనుభవాలను పంచుకోవడం అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది .వివాహానికి హాజరైన అతిథులు ఫొటోలు లేదా కార్యక్రమానికి సంబంధించిన వివరాలను బహిర్గతం చేయొద్దని ముందుగానే సూచనలు అందుకున్నట్లు ప్రచారం జరిగింది. ఇప్పటివరకు టేలర్ స్విఫ్ట్, ట్రావిస్ కెల్సీ కూడా తమ వివాహానికి సంబంధించిన అధికారిక చిత్రాలను విడుదల చేయలేదు. దీంతో ఈ వేడుక ఎలా జరిగిందనే విషయంపై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది న్యూయార్క్‌లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్స్‌లో శుక్రవారం రాత్రి ఈ వేడుక ఘనంగా జరిగినట్లు సమాచారం. వివాహం అనంతరం బీబీసీ రేడియో 1 ప్రముఖ డీజే గ్రెగ్ జేమ్స్, హాలీవుడ్ నటి జెసికా ఆల్బా వంటి ప్రముఖులు సామాజిక మాధ్యమాల ద్వారా నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. తాము ఈ వేడుకలో పాల్గొన్నట్లు కూడా వారు పరోక్షంగా ధృవీకరించారు.
కొంతమంది ప్రముఖులు మాత్రం నేరుగా వివాహం గురించి చెప్పకుండా సంకేతాల రూపంలో స్పందించారు. టేలర్ స్విఫ్ట్ పాటలను నేపథ్య సంగీతంగా ఉపయోగిస్తూ తాము ధరించిన ప్రత్యేక దుస్తుల చిత్రాలను పంచుకోవడం ద్వారా వివాహానికి హాజరైనట్లు అభిమానులు ఊహిస్తున్నారు. దీంతో ఈ వేడుకలో పాల్గొన్న ప్రముఖుల జాబితాపై సామాజిక మాధ్యమాల్లో విస్తృత చర్చ సాగుతోంది.
Fetching videos...
Fetching latest news...
No trending news