వంగర మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో క్లస్టర్ స్థాయి సమావేశం నిర్వహించారు. మండల టీడీపీ అధ్యక్షులు పిన్నింటి మోహన్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, స్థానిక సమస్యలు, అభివృద్ధి అంశాలపై విస్తృతంగా చర్చించారు.
ప్రతి రెండో బుధవారం నిర్వహించే క్లస్టర్ స్థాయి సమావేశంలో భాగంగా యూనిట్ స్థాయిలో మొదటి బుధవారం అందిన సమస్యలు, తీర్మానాలు, ప్రతిపాదనలను పరిశీలించి ఏకగ్రీవంగా ఆమోదించారు. ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని నాయకులు నిర్ణయించారు.
ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తల సమన్వయం, గ్రామ స్థాయిలో పార్టీ కార్యక్రమాల నిర్వహణ, ప్రజలకు ప్రభుత్వ పథకాలు చేరేలా చర్యలు తీసుకోవడం వంటి అంశాలపై చర్చించారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు కలిసి పనిచేయాలని సూచించారు.
ఈ సమావేశంలో మండల మాజీ ఎంపీపీ ప్రతినిధి ఎలకల దుర్గబాబు, ఏఎంసీ వైస్ ప్రెసిడెంట్ ధనలక్ష్మి కృష్ణమూర్తి, టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news