శృంగవరపుకోట నియోజకవర్గంలో టిడిపి కార్యకర్తల సంక్షేమమే పార్టీ ధ్యేయమని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి స్పష్టం చేశారు. ఎస్.కోట మండలం వేములాపల్లి గ్రామానికి చెందిన సీనియర్ కార్యకర్త బొడబల్ల సన్యాసిరావు ప్రమాదవశాత్తు మరణించడంతో ఆయన కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు.
టిడిపి సభ్యత్వం కలిగిన సన్యాసిరావుకు పార్టీ కేడర్ ఇన్సూరెన్స్ ద్వారా మంజూరైన రూ.5 లక్షల బీమా చెక్కును ఆయన భార్య బొడబల్ల ఉమాకు ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. కార్యకర్త కోల్పోవడం పార్టీకి తీరని లోటని, వారి కుటుంబానికి ఎల్లప్పుడూ పార్టీ అండగా ఉంటుందని ఆమె తెలిపారు.
అనంతరం గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. ఏ ఆపద వచ్చినా పార్టీతో పాటు ప్రభుత్వం కూడా సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో PACS చైర్మన్ గొర్రుపోటు సింహాచలం నాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు డోకుల చిన్న అచ్చం నాయుడు, ఇతర నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news