తూర్పు ఆసియాను శక్తివంతమైన బావి (Bavi) తుఫాన్ వణికిస్తోంది. దశాబ్దాల తర్వాత అత్యంత బలమైన తుఫాన్లలో ఒకటిగా పేర్కొంటున్న ఈ ప్రకృతి విపత్తు ఇప్పటికే ఫిలిప్పీన్స్‌లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తుఫాన్ ప్రభావంతో సంభవించిన భారీ కొండచరియలు విరిగిపడటంతో దక్షిణ ఫిలిప్పీన్స్‌లో కనీసం 15 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు ఇంకా గల్లంతైనట్లు అధికారులు వెల్లడించగా, శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు సహాయక బృందాలు యుద్ధ ప్రాతిపదికన గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. దాదాపు 1,000 కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించిన బావి తుఫాన్ ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో వేగంగా కదులుతూ తైవాన్ వైపు దూసుకెళ్తోంది. దీని విస్తీర్ణం ఫ్రాన్స్ దేశం వెడల్పుతో సమానంగా ఉండటం ఈ తుఫాన్ తీవ్రతను సూచిస్తోంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం తైవాన్ ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అనంతరం జపాన్‌కు చెందిన దూర ద్వీపాలను ప్రభావితం చేస్తూ, చివరకు ఆగ్నేయ చైనాలో శనివారం తీరాన్ని దాటే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు
తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే తైవాన్, జపాన్, చైనా ప్రాంతాల్లో అత్యవసర చర్యలు ప్రారంభమయ్యాయి. అనేక విమాన సర్వీసులను ముందస్తుగా రద్దు చేశారు. పాఠశాలలు, విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ప్రజలు అవసరమైన ఆహారం, తాగునీరు, మందులు, అత్యవసర వస్తువులను ముందుగానే నిల్వ చేసుకోవడంతో సూపర్ మార్కెట్లలో సరుకులు వేగంగా అమ్ముడయ్యాయి. అనేక ప్రాంతాల్లో దుకాణాల అల్మారాలు ఖాళీ అయ్యాయని స్థానిక మీడియా తెలిపింది.
ఫిలిప్పీన్స్‌లోని మిండనావో ద్వీపం తుఫాన్ ప్రభావాన్ని తీవ్రంగా ఎదుర్కొంటోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. కొన్ని కుటుంబాలు నిద్రలో ఉండగానే మట్టిపెళ్లల కింద చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 15 మంది మృతదేహాలను వెలికితీయగా, గల్లంతైన వారి కోసం సహాయక సిబ్బంది నిరంతరం శోధన కొనసాగిస్తున్నారు. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news