అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వలస విధానాలను మరింత కఠినతరం చేస్తున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా వీసా అపాయింట్మెంట్లను తాత్కాలికంగా నిలిపివేసింది. అమెరికా రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లలో వీసా సేవలకు సంబంధించిన అపాయింట్మెంట్లను ప్రపంచవ్యాప్తంగా సర్దుబాటు చేస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. కాన్సులర్ అధికారులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
అమెరికా విదేశాంగ శాఖ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. వీసా దరఖాస్తులను మరింత సమగ్రంగా, ఒకే విధమైన ప్రమాణాలతో పరిశీలించేందుకు కాన్సులర్ అధికారులకు ఈ శిక్షణ అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా అమెరికా ప్రభుత్వ ప్రజా సంక్షేమ ప్రయోజనాలపై ఆధారపడే అవకాశం ఉన్న దరఖాస్తుదారులను గుర్తించడంలో అధికారులు మరింత సమర్థంగా వ్యవహరించేలా శిక్షణ ఇవ్వడం కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా పేర్కొన్నారు.
ఈ పరిణామంతో ఇప్పటికే వీసా ఇంటర్వ్యూలకు తేదీలు పొందిన కొంతమంది దరఖాస్తుదారులకు కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. షెడ్యూల్ చేసిన ఇంటర్వ్యూలను రద్దు చేసి, భవిష్యత్తులో కొత్త తేదీ, సమయాన్ని తెలియజేస్తామని కొంతమంది దరఖాస్తుదారులకు సమాచారం పంపినట్లు నివేదికలు పేర్కొన్నాయి. అయితే వీసా అపాయింట్మెంట్లు సాధారణ స్థితికి ఎప్పుడు వస్తాయన్న దానిపై అమెరికా విదేశాంగ శాఖ స్పష్టమైన కాలపరిమితిని ప్రకటించలేదు.
వీసా అపాయింట్మెంట్ల నిలిపివేతను కేవలం పరిపాలనా శిక్షణ చర్యగా అమెరికా ప్రభుత్వం వివరిస్తున్నప్పటికీ, ఇది ట్రంప్ ప్రభుత్వం అమలు చేస్తున్న విస్తృత వలస విధానాల కఠినతర చర్యల మధ్య చోటుచేసుకుంది. ట్రంప్ ప్రభుత్వం అక్రమ వలసలను అడ్డుకోవడంతో పాటు చట్టబద్ధమైన వలస ప్రక్రియపైనా తనిఖీలను పెంచుతోంది. వీసాలు, గ్రీన్ కార్డుల రద్దు, వీసా దరఖాస్తులపై మరింత కఠినమైన పరిశీలన, వలసదారుల నేపథ్యంపై విస్తృత తనిఖీలు వంటి చర్యలు ఇప్పటికే చర్చనీయాంశంగా ట్రంప్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా వలస విధానాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. అక్రమ వలసలపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు చట్టబద్ధమైన వలస మార్గాలపైనా నియంత్రణ పెంచుతోంది. వీసా, గ్రీన్ కార్డు రద్దు చర్యలు, దరఖాస్తులపై అదనపు పరిశీలన, కొన్ని వీసా వర్గాలకు అధిక రుసుములు వంటి చర్యలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి లేదా ప్రతిపాదన దశలో ఉన్నాయి. తాజా ప్రపంచవ్యాప్త వీసా అపాయింట్మెంట్ మార్పులు ఈ విస్తృత విధానంలో మరో పరిణామంగా కనిపిస్తున్నాయి.
అమెరికా వలస విధానాల్లో భాగంగా కొన్ని వీసా దరఖాస్తులపై రాజకీయ అభిప్రాయాలు, కొన్ని నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడం వంటి అంశాలను కూడా పరిశీలిస్తున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. దీనిపై హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. వలస విధానాల పేరుతో వ్యక్తుల భావప్రకటన స్వేచ్ఛ, న్యాయపరమైన హక్కులకు భంగం కలిగే ప్రమాదం ఉందని విమర్శలు వచ్చాయి. అయితే ట్రంప్ ప్రభుత్వం తన చర్యలను దేశీయ భద్రతను మెరుగుపరచడం, వలస వ్యవస్థలో నియంత్రణను పెంచడం వంటి కారణాలతో సమర్థిస్తోంది.
Fetching videos...
Fetching latest news...
No trending news