భారత యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రానికి సిద్ధమవుతున్న వేళ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల సందర్భంగా అతనికి ప్రత్యేక డ్రెస్సింగ్ రూమ్ కేటాయించనున్నారు. అయితే దీనికి ఐసీసీ నిబంధనలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టమైంది. యునైటెడ్ కింగ్డమ్లో అమల్లో ఉన్న చైల్డ్ సేఫ్గార్డింగ్ చట్టాల ప్రకారం 16 ఏళ్లలోపు మైనర్ క్రీడాకారులు పెద్దలతో కలిసి చేంజింగ్ రూమ్‌లను ఉపయోగించకూడదు. ప్రస్తుతం వైభవ్ వయస్సు 15 సంవత్సరాలు మాత్రమే కావడంతో అతనికి ప్రతి వేదికలో ప్రత్యేక ప్రైవేట్ రూమ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. మ్యాచ్‌ల సమయంలో, జట్టు సమావేశాల్లో సీనియర్ ఆటగాళ్లతో కలిసి ఉండేందుకు ఎలాంటి ఆంక్షలు లేవు. కానీ దుస్తులు మార్చుకునే సందర్భాల్లో మాత్రం ప్రత్యేక గదినే ఉపయోగించాల్సి ఉంటుంది. ఐపీఎల్లో అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన వైభవ్, ఇప్పుడు టీమిండియా తరఫున అరంగేట్రం చేసి మరో అరుదైన ఘనత సాధించేందుకు సిద్ధమవుతున్నాడు. అతని ఎంట్రీపై భారత క్రికెట్ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
Fetching videos...
Fetching latest news...
No trending news