నెల్లూరు జిల్లా కలిగిరి మండలం తూర్పు దూబగుంట గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. టిడిపి కార్యకర్త వర్ధినేని శ్రీనివాసులు విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందారు. ఆయన సారాయి వ్యతిరేక ఉద్యమ నేత దూబగుంట రోశమ్మ పెద్ద కుమారుడు కావడం గ్రామంలో మరింత దుఃఖాన్ని కలిగించింది.
ఈ ఘటన తెలిసిన వెంటనే ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు గ్రామానికి చేరుకుని మృతదేహానికి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.
శ్రీనివాసులు పార్టీకి అంకితభావంతో పనిచేసిన నిబద్ధత గల కార్యకర్త అని, ఆయన మరణం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Fetching videos...
Fetching latest news...
No trending news