కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరవేయాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ నెల 27వ తేదీ నుంచి నెల రోజులపాటు నిర్వహించనున్న "కూటమి ప్రభుత్వం సంక్షేమ విజయాలు" డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.
రామచంద్రపురంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమన్వయ సమావేశంలో మంత్రి సుభాష్ మాట్లాడారు. ప్రతి కార్యకర్త ప్రజల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించాలని సూచించారు.
ప్రజల అభిప్రాయాలు, సమస్యలు, అవసరాలను నేరుగా తెలుసుకుని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే బాధ్యతను కార్యకర్తలు తీసుకోవాలని మంత్రి తెలిపారు. ప్రజలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రంలో పారదర్శకమైన ప్రజాకేంద్రీకృత పాలన కొనసాగుతోందని మంత్రి సుభాష్ పేర్కొన్నారు. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, వృద్ధులు, బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజలకు వివరించాలని తెలిపారు.
రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని మంత్రి సూచించారు. గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి, ఉపాధి అవకాశాల పెంపు, పెట్టుబడుల ఆకర్షణ, ప్రజలకు మెరుగైన సేవల అందింపు వంటి అంశాలను వివరించాలని అన్నారు.
ప్రభుత్వం భవిష్యత్తులో చేపట్టనున్న అభివృద్ధి ప్రణాళికలను కూడా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని మంత్రి చెప్పారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్న ప్రభుత్వంపై మరింత విశ్వాసం పెంచే విధంగా ప్రచార కార్యక్రమం ఉండాలని సూచించారు.
ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న మంత్రి సుభాష్, ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేసి డోర్ టు డోర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ప్రజలతో మమేకమై ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించడం ద్వారా పార్టీ మరింత బలోపేతం అవుతుందని తెలిపారు.
ఈ సమావేశంలో ఏఎంసీ చైర్మన్ అక్కల రిష్వంత్ రాయ్, రామచంద్రపురం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఉండవిల్లి శివ, రామచంద్రపురం రూరల్ మండల అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనుబాబు, గంగవరం మండల అధ్యక్షుడు మేడిశెట్టి రవికుమార్, క్లస్టర్, కో క్లస్టర్, బూత్, డివిజన్, వార్డు కమిటీ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news