పార్వతీపురం జిల్లాలో వెలుగు కార్యక్రమంలో జరిగిన అవకతవకలపై తక్షణ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్లో డీఆర్ఓ కె. హేమలతకు వినతిపత్రం అందజేస్తూ, డీసీసీ అధ్యక్షుడు వంగల దాలినాయుడు, ఓబీసీ చైర్మన్ సిరిసిపల్లి సాయి శ్రీనివాస్, కోఆర్డినేటర్ గేదెల రామకృష్ణలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంక్వయిరీ రిపోర్టు ఇచ్చినా బాధ్యులపై చర్యలు లేకపోవడం అన్యాయమన్నారు.
యంత్రాల కొనుగోళ్లలో అవకతవకలు, నిధుల దుర్వినియోగం, సరైన రికార్డుల లేమి, అనుమతి లేకుండా నిధుల మళ్లింపు వంటి అంశాలపై ప్రశ్నలు లేవనెత్తారు. ప్యాడీ ప్రొక్యూర్మెంట్, ఎఫ్పీఓ నిధులు, వీడీవీకే అడ్వాన్సులు కలిపి రూ.1.5 కోట్లకు పైగా అవకతవకలు జరిగాయని ఆరోపించారు.
డీఆర్డీఏ కార్యాలయం వద్ద యంత్రాలు ఉపయోగం లేకుండా పడి ఉండటం, గిరిజనులకు ఉపాధి కల్పించకపోవడం వంటి అంశాలను ప్రస్తావించారు. వెంటనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
Fetching videos...
Fetching latest news...
No trending news