వెనిజులాలో భారీ భూకంపాల విషాదం నుంచి ప్రజలు ఇంకా కోలుకోకముందే మరో అరుదైన ప్రకృతి దృశ్యం అందరినీ ఆశ్చర్యానికి, ఆందోళనకు గురిచేసింది. రాజధాని కారకాస్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఆకాశం ఒక్కసారిగా ఎర్రటి–నారింజ రంగులోకి మారడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వేగంగా వైరల్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. చాలామంది దీనిని భూకంపాలతో ముడిపెడుతూ ఊహాగానాలు ప్రచారం చేయగా, మరికొందరు ఇది ప్రకృతి సృష్టించిన అరుదైన వాతావరణ దృశ్యమని అభిప్రాయపడ్డారు
జూన్ 24న వెనిజులాలో వరుసగా సంభవించిన 7.2, 7.5 తీవ్రతల రెండు శక్తివంతమైన భూకంపాలు దేశాన్ని తీవ్రంగా కుదిపేశాయి. అనేక భవనాలు కూలిపోగా, వందలాది మంది గాయపడ్డారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్న సమయంలోనే జూన్ 30 సాయంత్రం ఆకాశం ఎర్రటి రంగులో కనిపించడం ప్రజల్లో మరింత భయాన్ని పెంచింది. ఇప్పటికే భూకంపాల కారణంగా మానసిక ఆందోళనలో ఉన్న ప్రజలు దీనిని మరో ప్రమాదానికి సంకేతంగా భావించి ఇళ్ల బయటకు వచ్చి వీడియోలు చిత్రీకరించారు.
సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన వీడియోల్లో సాయంత్రం వేళ మొత్తం ఆకాశం ఎర్రటి, నారింజ రంగులతో కప్పబడి కనిపించింది. అనేక మంది ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేయగా, కొందరు దీనిని అపశకునంగా పేర్కొన్నారు. మరికొందరు ఇది భూకంపాలకు ముందు లేదా తర్వాత కనిపించే అసాధారణ సంకేతమా అనే సందేహాలు వ్యక్తం చేశారు. అయితే ఇప్పటివరకు శాస్త్రవేత్తలు లేదా అధికారిక సంస్థలు ఈ ఎర్రటి ఆకాశాన్ని భూకంపాలకు నేరుగా అనుసంధానించే ఎలాంటి ఆధారాలను వెల్లడించలేదు.
Fetching videos...
Fetching latest news...
No trending news