2027 వన్డే ప్రపంచకప్‌కు ముందు విరాట్ కోహ్లీ భవిష్యత్‌పై క్రికెట్ వర్గాల్లో ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. కోహ్లీ జట్టులో కొనసాగుతాడనే నమ్మకం ఉన్నప్పటికీ, బీసీసీఐ లేదా టీమ్ మేనేజ్మెంట్ నుంచి ఇప్పటివరకు స్పష్టమైన ప్రకటన రాకపోవడం అభిమానుల్లో సందేహాలకు దారితీసింది. ఇదే సమయంలో ఐపీఎల్ సందర్భంగా తనపై అనవసర ఒత్తిడి ఉండకూడదని కోహ్లీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆర్సీబీ మెంటర్ దినేష్ కార్తీక్ కీలక సూచన చేశాడు. కోహ్లీలాంటి అనుభవజ్ఞుడికి పూర్తి స్వేచ్ఛ, గౌరవం ఇవ్వాలని, అతని ఆట తీరు లేదా ప్రాసెస్‌లో జోక్యం చేసుకోకుండా వెన్నుదన్నుగా నిలిస్తే అత్యుత్తమ ప్రదర్శన చేస్తాడని అభిప్రాయపడ్డాడు. మైఖేల్ జోర్డాన్, నోవాక్ జొకోవిచ్, రోజర్ ఫెదరర్ వంటి దిగ్గజాలతో కోహ్లీని పోల్చిన కార్తీక్, ఆర్సీబీ అనుసరించిన నమ్మకం, స్వేచ్ఛ మోడల్‌ను టీమిండియా కూడా అమలు చేయాలని సూచించాడు. దీంతో గౌతమ్ గంభీర్ కోహ్లీ విషయంలో తన వ్యూహాన్ని మార్చుతాడా అనే చర్చ మరింత వేడెక్కింది.
Fetching videos...
Fetching latest news...
No trending news