బ్రిటన్‌లోని వేల్స్ తీరంలో జరిగిన విమాన ప్రమాదం ఉత్కంఠ రేపింది. చిన్న మైక్రోలైట్ విమానం అత్యవసర పరిస్థితుల్లో సముద్రంలో కూలిపోవడంతో అందులో ఉన్న ఇద్దరు ప్రయాణికులు విమానం రెక్కపై కూర్చొని సహాయం కోసం వేచి చూశారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఘటన వేల్స్‌లోని కార్డిగన్ బే సమీపంలో, కార్డిగన్ దీవికి సమీపంలో చోటుచేసుకుంది.
సమాచారం అందుకున్న వెంటనే తీర రక్షక దళం, ఆర్ఎన్ఎల్ఐ లైఫ్బోట్లు, కోస్ట్‌గార్డ్ హెలికాప్టర్ సంయుక్తంగా సహాయక చర్యలు చేపట్టాయి. సముద్రంలో తేలియాడుతున్న విమానం రెక్కపై కూర్చున్న ఇద్దరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చి వైద్య సిబ్బందికి అప్పగించారు. చల్లని నీటిలో కొంతసేపు ఉండటంతో వారికి స్వల్ప అస్వస్థత ఏర్పడినప్పటికీ, ప్రాణాపాయం లేదని అధికారులు తెలిపారు
Fetching videos...
Fetching latest news...
No trending news