సాఫ్ట్వేర్ అభివృద్ధి ప్రపంచంలో ఇప్పుడు వేగంగా ప్రాచుర్యం పొందుతున్న కొత్త ధోరణి "వైబ్ కోడింగ్". సంప్రదాయ పద్ధతిలో ఒక్కో పంక్తి కోడ్‌ను స్వయంగా రాయాల్సిన అవసరం లేకుండా, మనకు కావాల్సిన పనిని సాధారణ భాషలో వివరిస్తే కృత్రిమ మేధ ఆధారిత వ్యవస్థలు అవసరమైన కోడ్‌ను రూపొందించడం ఈ విధానం ప్రత్యేకత. దీంతో కోడింగ్‌పై లోతైన అవగాహన లేకున్నా అనువర్తనాలు, వెబ్సైట్లు, చిన్న సాఫ్ట్వేర్ సాధనాలను రూపొందించడం మరింత సులభంగా మారుతోంది ఈ విధానంలో వినియోగదారు తాను రూపొందించాలనుకున్న అనువర్తనం లేదా సాఫ్ట్వేర్ గురించి సహజ భాషలో సూచనలు ఇస్తాడు. ఆ సూచనలను విశ్లేషించిన కృత్రిమ మేధ వ్యవస్థ అవసరమైన ప్రోగ్రామింగ్ కోడ్‌ను స్వయంగా తయారు చేస్తుంది. ఫలితం ఆశించిన విధంగా రాకపోతే మరిన్ని సూచనలు ఇవ్వడం ద్వారా కోడ్‌ను సవరించుకోవచ్చు. ఈ కారణంగా సంప్రదాయ కోడింగ్‌తో పోలిస్తే అభివృద్ధి వేగం గణనీయంగా పెరుగుతోంది
Fetching videos...
Fetching latest news...
No trending news