అర్జున్ రామ్ మేఘ్వాల్ మహిళా రిజర్వేషన్ల అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా సాధికారత దిశగా ఇది చారిత్రక ఘట్టమని ఆయన పేర్కొన్నారు. మహిళలకు రాజకీయాల్లో 33 శాతం రిజర్వేషన్ల అమలు కోసం సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు.
“నారీశక్తి వందన్ అధినియం” బిల్లు 2023లోనే పార్లమెంట్లో ఆమోదం పొందిందని ఆయన గుర్తు చేశారు. మహిళలకు సమాన అవకాశాలు కల్పించడం దేశ అభివృద్ధికి కీలకమని తెలిపారు. ఈ బిల్లు అమలుతో రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
పార్లమెంట్ ఇప్పటికే మహిళా రిజర్వేషన్లకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో, దీనిని త్వరగా అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కొన్ని బిల్లులు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయని, భావితరాలు వాటిని మరువలేవని వ్యాఖ్యానించారు.
ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టడం తనకు గర్వకారణమని అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. మహిళా శక్తిని దేశ నిర్మాణంలో మరింతగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.
Fetching videos...
Fetching latest news...
No trending news