యనమలకుదురు గ్రామంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారి ఆదేశాల మేరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. రాష్ట్ర గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ శొంటి శివరాం ప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. వృద్ధులు, వితంతువులు ప్రతి నెల ఒకటవ తేదీన ఇంటి వద్దకే పెన్షన్ అందుతుండటంపై సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా శివరాం ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ, లబ్ధిదారుల సమస్యలను స్థానిక శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరిస్తున్నామని తెలిపారు. రోడ్లు, డ్రైనేజీ వంటి స్థానిక సమస్యలను కూడా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కొత్త పెన్షన్లపై ప్రజల్లో ఉన్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని త్వరలోనే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు.
అదే సందర్భంలో రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చేపడుతున్న పలు కీలక పథకాల గురించి వివరించారు. నేతన్నల కుటుంబాలకు ఉపశమనం కలిగించేలా ఏప్రిల్ 1 నుంచి ఉచిత విద్యుత్ పథకం ప్రారంభమైంది. మగ్గం నేతన్నలకు 200 యూనిట్లు, మర మగ్గం నేతన్నలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నారు. ఈ పథకం ద్వారా సుమారు 1,04,000 చేనేత కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.
నేతన్నల ఆర్థిక స్థితి మెరుగుపడేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్లు, టెక్స్టైల్ ప్రాజెక్టులు, సహకార సంఘాలకు ఆర్థిక సాయం, ముడిసరుకు సబ్సిడీలు, ఆధునిక డిజైన్ శిక్షణ వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. చేనేత పెన్షన్లు 3 వేల నుండి 4 వేల రూపాయలకు పెంచడం, త్రిఫ్ట్ వాటాను పెంచడం వంటి నిర్ణయాలు తీసుకున్నారు.
ఆప్కో ద్వారా డిజిటలైజేషన్, ఈ-కామర్స్ డెలివరీ, ఫోన్ పే వంటి సాంకేతికతలను ప్రవేశపెట్టి అమ్మకాలను పెంచుతున్నారు. ‘వన్ డిస్ట్రిక్ట్ – వన్ ప్రొడక్ట్’ కింద చేనేత రంగానికి పలు అవార్డులు కూడా లభించాయి. నేతన్న భరోసా పథకం ద్వారా భవిష్యత్తులో అదనపు ఆర్థిక సహాయం అందించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
మొత్తంగా, సంక్షేమం మరియు అభివృద్ధిని సమన్వయంతో ముందుకు తీసుకెళ్లుతూ చేనేత కుటుంబాలకు గౌరవప్రద జీవనం కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని నాయకులు స్పష్టం చేశారు.
Fetching videos...
Fetching latest news...
No trending news