డా. వి.ఎం. థామస్ యువత ఉగ్రవాదం, దురలవాట్లకు దూరంగా ఉండాలని, పీస్ అంబాసిడర్లుగా ఎదగాలని పిలుపునిచ్చారు. చిత్తూరులోని విజయం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో నిర్వహించిన కాశ్మీర్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం ముగింపు సభలో ఆయన పాల్గొన్నారు.
కాశ్మీర్లోని 6 జిల్లాల నుంచి 132 మంది యువత పాల్గొన్నారు. భిన్నత్వంలో ఏకత్వమే భారత్ ప్రత్యేకత అని, దేశానికి యువతే అత్యంత విలువైన సంపద అని ఆయన పేర్కొన్నారు. యువత అప్రమత్తంగా ఉండి దేశ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు.
విజయం విద్యాసంస్థల ఛైర్మన్ డా. ఏం. తేజోమూర్తి మాట్లాడుతూ యువత క్రమశిక్షణతో ముందుకు సాగి ఉగ్రవాదం, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో పలు శిక్షణ సెషన్లు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
Fetching videos...
Fetching latest news...
No trending news