పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో పులి అలికిడి కలకలం రేపింది. సోమవారం మధ్యాహ్నం పాత పరగసానిపాడు, బోడిగూడెం గ్రామాల మధ్యుగా అటవీశాఖ సిబ్బంది వెళ్తుండగా పులి కదలికలు కనిపించాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు వాహనాలను అక్కడే నిలిపివేసి వెంటనే వెనక్కు పరుగులు తీశారు.
ఈ ఘటనతో పరిసర ప్రాంతాల్లో భయం నెలకొంది. రావిలంక, బోడిగూడెం గ్రామాల వైపు ప్రజలు వెళ్లకుండా అటవీశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని, అడవికి సమీప ప్రాంతాల్లో ఒంటరిగా వెళ్లవద్దని సూచించారు.
అటవీశాఖ ప్రత్యేక బృందాలు పులి సంచారంపై నిఘా ఉంచి పరిస్థితిని పరిశీలిస్తున్నాయి. పులి కదలికలను గుర్తించేందుకు ట్రాకింగ్ చర్యలు చేపట్టిన అధికారులు ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.
Fetching videos...
Fetching latest news...
No trending news