ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలను కొనుగోలు చేసే ముందు వినియోగదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని భారత ఆహార భద్రతా సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) అప్రమత్తం చేసింది. ఆకర్షణీయమైన ప్యాకింగ్‌ను చూసి మోసపోకూడదని, ప్రతి ఉత్పత్తిపై ఉన్న లేబుల్‌ను తప్పనిసరిగా చదవాలని సూచించింది.
ఉత్పత్తి లేబుల్లోని పదార్థాల జాబితా, అలర్జీ సమాచారం, FSSAI లైసెన్స్ నంబర్, ఎక్స్పైరీ తేదీ, పోషక విలువలు వంటి వివరాలను గమనించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అలాగే చక్కెర, ఉప్పు, కొవ్వు పరిమాణాలను కూడా పరిశీలించడం ద్వారా ఆరోగ్యానికి అనుకూలమైన ఎంపికలు చేయవచ్చని తెలిపింది.
వినియోగదారులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో స్వయంగా బాధ్యత తీసుకోవాలని, ప్యాకేజ్డ్ ఫుడ్ ఎంపికలో అవగాహనతో వ్యవహరించాలని FSSAI సూచించింది.
Fetching videos...
Fetching latest news...
No trending news