అయోధ్య రామాలయ విరాళాల వ్యవహారంపై కొనసాగుతున్న రాజకీయ వివాదం మరింత ముదిరింది. ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్‌ను అయోధ్యలోని ఒక హోటల్లో గృహనిర్బంధంలో ఉంచారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. రామాలయ దర్శనానికి, అలాగే పార్టీ ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం పర్యటనకు ముందు ఈ చర్యలు తీసుకోవడం తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. కాంగ్రెస్ నాయకులు అయోధ్య పర్యటనను అడ్డుకోవడమే లక్ష్యం
కాంగ్రెస్ పార్టీ ముందుగానే స్థానిక యంత్రాంగానికి తమ పర్యటన గురించి సమాచారం ఇచ్చినట్లు తెలిపింది. జూన్ 30న అజయ్ రాయ్ నేతృత్వంలో పలువురు ఎంపీలు, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు అయోధ్యలోని రామాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే పర్యటన ప్రారంభానికి ముందే అజయ్ రాయ్‌ను హోటల్ నుంచి బయటకు రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారని పార్టీ పేర్కొంది. ఈ చర్య ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని కాంగ్రెస్ తీవ్రంగా విమర్శించింది.
గా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిందని ఆరోపిస్తుండగా, ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
అజయ్ రాయ్ కూడా ఈ వ్యవహారంపై స్పందిస్తూ, తాను అయోధ్యకు చేరుకున్న వెంటనే పోలీసు అధికారులు తనను అదుపులోకి తీసుకుని మరో అతిథి గృహానికి తరలించారని ఆరోపించారు. భగవాన్ శ్రీరాముడి దర్శనం చేసుకోవడం ఇప్పుడు నేరమా అని ప్రశ్నించారు. రామభక్తులు అయోధ్యకు రావడాన్ని ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని నిలదీశారు. తాము ఎలాంటి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గబోమని, రామాలయ దర్శనం తప్పకుండా చేస్తామని ఆయన స్పష్టం చేశారు
Fetching videos...
Fetching latest news...
No trending news