ప్రతిష్టాత్మక Indian Institute of Technology Delhi వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 7 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రోగ్రామ్ స్పెషలిస్ట్, టెక్నికల్ కమ్ నాలెడ్జ్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్, ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ సైంటిస్ట్, సీనియర్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టులను భర్తీ చేయనుంది. సంబంధిత విభాగాల్లో పీజీ, ఎం.టెక్, ఎంఎస్, పీహెచ్డీ అర్హతలతో పాటు నిర్దిష్ట అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ నియామకాల్లో ఎంపికైన వారికి నెలకు రూ.75 వేల నుంచి రూ.2.10 లక్షల వరకు వేతనం లభించనుంది. ప్రోగ్రామ్ స్పెషలిస్ట్‌కు రూ.2.10 లక్షలు, టెక్నికల్ కమ్ నాలెడ్జ్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్‌కు రూ.1.50 లక్షలు, ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ సైంటిస్ట్‌కు రూ.1.20 లక్షలు, సీనియర్ ప్రాజెక్ట్ సైంటిస్ట్‌కు రూ.75 వేల జీతం అందించనున్నారు.
ఈ పోస్టుల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు. విద్యార్హతలు, అనుభవం ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు ఐఐటీ ఢిల్లీ IRD వెబ్సైట్ నుంచి దరఖాస్తు ఫారమ్ డౌన్లోడ్ చేసుకుని, పూర్తి చేసిన అప్లికేషన్‌ను అవసరమైన సర్టిఫికెట్లతో కలిసి drsahuiitd@gmail.com కు పంపాలి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ జులై 2, 2026 సాయంత్రం 5 గంటలు. ఉద్యోగావకాశాల కోసం ఎదురు చూస్తున్న అర్హులైన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.
Fetching videos...
Fetching latest news...
No trending news