యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రవాణా చరిత్రలో చిరస్మరణీయ ఘట్టం ఆవిష్కృతమైంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఎతిహాద్ రైల్ తొలి ప్రయాణికుల రైలు సేవలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఫుజైరా స్టేషన్ నుంచి అబుదాబీకి బయలుదేరిన తొలి రైలులో వందలాది మంది ప్రయాణికులు ఉత్సాహంగా పాల్గొని ఈ చారిత్రక క్షణానికి సాక్షులయ్యారు. దేశ అభివృద్ధిలో మరో మైలురాయిగా నిలిచిన ఈ ప్రారంభాన్ని పలువురు "దేశం ఆనందించే క్షణం"గా అభివర్ణించారు
ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవల మొదటి దశలో అబుదాబీ–ఫుజైరా మార్గాన్ని ప్రారంభించారు. ఈ రైలు గరిష్ఠంగా గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ, అబుదాబీ నుంచి ఫుజైరాకు చేరుకోవడానికి కేవలం ఒక గంట 45 నిమిషాల సమయం మాత్రమే తీసుకుంటుంది. రహదారి మార్గంతో పోలిస్తే ఇది గణనీయమైన సమయాన్ని ఆదా చేయనుంది. ప్రారంభ దశలో రోజుకు పలు రౌండ్ ట్రిప్లు నిర్వహిస్తూ, ప్రయాణికుల స్పందన ఆధారంగా సేవలను విస్తరించేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు
ఈ రైలు సేవలు కేవలం ఒక కొత్త రవాణా వ్యవస్థ మాత్రమే కాదు, యూఏఈలోని వివిధ ఎమిరేట్ల మధ్య అనుసంధానాన్ని మరింత బలోపేతం చేసే జాతీయ ప్రాజెక్టుగా భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రారంభమైన మార్గం తరువాత దశలవారీగా దుబాయ్, షార్జా, అల్ ధఫ్రా, అల్ ధైద్ తదితర ప్రాంతాలకు కూడా ప్రయాణికుల సేవలు విస్తరించనున్నాయి. పూర్తి స్థాయిలో ఈ నెట్వర్క్ 11 ప్రధాన నగరాలు, ప్రాంతాలను అనుసంధానించేలా అభివృద్ధి చేయబడుతోంది.
Fetching videos...
Fetching latest news...
No trending news