భారత్-అమెరికా మధ్య ఎన్నో నెలలుగా కొనసాగుతున్న కీలక వాణిజ్య ఒప్పంద చర్చలు తుది దశకు చేరుకున్నాయని అమెరికా రాయబారి సెర్గియో గోర్ వెల్లడించారు. ఒప్పందానికి సంబంధించిన చర్చల్లో 99 శాతం పూర్తయ్యాయని, చివరి ఒక శాతం అంశాలపై మాత్రమే చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. వాషింగ్టన్లో జరిగిన యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్షిప్ ఫోరమ్ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గత 18 నెలలుగా ఇరు దేశాలు ఈ ఒప్పందంపై కసరత్తు చేస్తున్నాయని, త్వరలోనే దీనికి తుది రూపం దక్కే అవకాశముందని చెప్పారు.
భారత్-అమెరికా సంబంధాలు మరింత బలపడటానికి అమెరికా అధ్యక్షుడు Donald Trump, భారత ప్రధాని Narendra Modi మధ్య ఉన్న వ్యక్తిగత అనుబంధం కూడా కారణమని గోర్ పేర్కొన్నారు. ట్రంప్ తన భారత పర్యటనను ఇప్పటికీ ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటారని, భవిష్యత్తులో మరోసారి భారత్‌ను సందర్శించే అవకాశం ఉందని తెలిపారు.
భారత్‌పై అమెరికాకు పూర్తి విశ్వాసం ఉందని, విశ్వసనీయ వ్యూహాత్మక భాగస్వామిగా చూస్తోందని ఆయన స్పష్టం చేశారు. కృత్రిమ మేధస్సు, సాంకేతికత, విమానయాన రంగాల్లో పెట్టుబడులు, సహకారం పెంచేందుకు అమెరికా సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని వెల్లడించారు. అలాగే ప్రధాని మోదీకి అమెరికాలో ఎప్పుడూ స్వాగతమేనని, డిసెంబర్లో అమెరికాలో జరిగే G20 Summit 2026 సందర్భంగా ఆయన పర్యటనకు అవకాశం ఉందని తెలిపారు. త్వరలో కుదిరే వాణిజ్య ఒప్పందం ఇరు దేశాల ఆర్థిక, వ్యూహాత్మక భాగస్వామ్యానికి మరింత బలాన్ని చేకూర్చనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news