ఫుట్‌బాల్ మ్యాచ్‌లు చూస్తున్నప్పుడు కామెంటేటర్లు తరచుగా VAR, ఫ్రీ కిక్, పెనాల్టీ, క్లీన్ షీట్, హ్యాండ్‌బాల్ వంటి టెక్నికల్ పదాలను వాడుతుంటారు. ఇవి వినడానికి సాధారణంగా అనిపించినా, వాటి వెనుక ఉన్న అర్థాలు మరియు రూల్స్ చాలా ప్రత్యేకంగా ఉంటాయి. చాలా మంది ప్రేక్షకులు ఈ పదాలనే ఫుట్‌బాల్ రూల్స్‌గా భావిస్తారు కానీ వాస్తవానికి ఇవి ఆటలో జరిగే పరిస్థితులు లేదా రెఫరీ తీసుకునే నిర్ణయాలను సూచించే టర్మినాలజీ మాత్రమే.
మైదానంలో రెఫరీకి సందేహం వచ్చినప్పుడు వీడియో రీప్లే ఆధారంగా మరో రిఫరీ నిర్ణయం చెబుతాడు. ఇది క్రికెట్లో థర్డ్ అంపైర్ లాంటిది. ఫ్రీ కిక్ అనేది చిన్న ఫౌల్ జరిగినప్పుడు ప్రత్యర్థి జట్టుకు ఇచ్చే అవకాశం. ఫౌల్ జరిగిన చోట నుంచే బాల్‌ను నేరుగా కిక్ చేయవచ్చు.
పెనాల్టీ అనేది పెద్ద ఫౌల్ గోల్ ఏరియాలో జరిగితే ఇచ్చే అవకాశం. ఇందులో కేవలం గోల్ కీపర్ మాత్రమే ఎదురుగా ఉంటాడు కాబట్టి గోల్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కార్నర్ కిక్ అంటే డిఫెన్స్ టీమ్ వల్ల బాల్ గోల్ లైన్ దాటి బయటకు వెళ్లినప్పుడు అటాకింగ్ టీమ్‌కు ఇచ్చే అవకాశం.
క్లీన్ షీట్ అనేది గోల్ కీపర్ లేదా డిఫెన్స్ టీమ్ మొత్తం మ్యాచ్‌లో ఒక్క గోల్ కూడా ఇవ్వకుండా ఆడినప్పుడు ఉపయోగించే టర్మ్. ఇది వారి అద్భుత ప్రదర్శనను సూచిస్తుంది. హ్యాండ్‌బాల్ రూల్ ప్రకారం గోల్ కీపర్ తప్ప ఇతర ఆటగాళ్లు చేతితో బాల్‌ను తాకకూడదు. అలా తాకితే అది ఫౌల్‌గా పరిగణిస్తారు.
ఓన్ గోల్ అంటే పొరపాటున ఆటగాడు తన జట్టుకే గోల్ వేసిన పరిస్థితి. ఇది ప్రత్యర్థి జట్టుకు పాయింట్‌గా లెక్కించబడుతుంది. పెనాల్టీ షూటౌట్ అనేది మ్యాచ్ టై అయితే గెలుపు నిర్ణయించడానికి ఉపయోగించే విధానం. ఇరు జట్లకు 5 చొప్పున కిక్స్ ఇచ్చి ఎక్కువ గోల్స్ చేసిన జట్టు విజయం సాధిస్తుంది.
ఇలా ఫుట్‌బాల్‌లో ఉపయోగించే ఈ పదాలు ఆటను మరింత ఆసక్తికరంగా మార్చుతాయి. వీటి అర్థం తెలుసుకుంటే మ్యాచ్ చూడటం మరింత క్లియర్‌గా, ఎంజాయ్‌మెంట్‌గా మారుతుంది.
Fetching videos...
Fetching latest news...
No trending news