Railway Recruitment Board దేశవ్యాప్తంగా 6,565 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్‌కు 323 పోస్టులు, టెక్నీషియన్ గ్రేడ్-IIIకు 6,242 పోస్టులు ఉన్నాయి. సికింద్రాబాద్ రైల్వే జోన్లో మొత్తం 399 ఖాళీలు ఉండగా, అర్హులైన అభ్యర్థులు జూన్ 30 నుంచి జులై 29, 2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
అభ్యర్థులు పోస్టులను బట్టి 10వ తరగతి, ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ లేదా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. గ్రేడ్-I పోస్టులకు 18 నుంచి 33 ఏళ్లు, గ్రేడ్-III పోస్టులకు 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది. ఎంపికైన వారికి గ్రేడ్-I పోస్టులకు నెలకు రూ.29,200, గ్రేడ్-III పోస్టులకు రూ.19,900 ప్రారంభ వేతనం లభిస్తుంది.
ఎంపిక ప్రక్రియలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్షలు నిర్వహిస్తారు. జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, మైనారిటీలు, మాజీ సైనికులు, ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులకు రూ.250 దరఖాస్తు ఫీజు నిర్ణయించారు. రైల్వే శాఖలో ప్రభుత్వ ఉద్యోగం కోరుకునే యువతకు ఇది మంచి అవకాశంగా భావిస్తున్నారు.
అధికారిక దరఖాస్తు వెబ్సైట్:
RRB Apply Portal
Fetching videos...
Fetching latest news...
No trending news