కేంద్ర ప్రభుత్వం చేపట్టిన తాజా జనగణన ప్రక్రియలో తెలంగాణలో కుటుంబాల సంఖ్య సుమారు 1.14 కోట్లకు చేరినట్లు ప్రాథమిక అంచనాలు వెలువడుతున్నాయి. అధికారిక గణాంకాలు ఇంకా విడుదల కాకపోయినా, గత సర్వేలతో పోలిస్తే కుటుంబాలు, జనాభా గణనీయంగా పెరిగినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం ఆరు నెలల క్రితం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో జనాభా 3.55 కోట్లుగా అంచనా వేయగా, తాజా జనగణన లెక్కల్లో అది 4.35 కోట్లకు పైగా ఉండొచ్చని తెలుస్తోంది.
తెలంగాణ ఏర్పడిన తర్వాత కేంద్రం నిర్వహిస్తున్న తొలి అధికారిక జనగణనలో మొదటి దశగా మే 11 నుంచి జూన్ 9 వరకు ఇళ్లు, కుటుంబాలు, భవనాల వివరాలు సేకరించారు. రెండో దశలో వ్యక్తిగత వివరాల సేకరణను 2027 ఫిబ్రవరిలో చేపట్టనున్నారు. ముందుగా నల్గొండ జిల్లా తిప్పర్తి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక, హైదరాబాద్ శివారులోని రామచంద్రపురంలో పైలట్ సర్వే నిర్వహించనున్నారు.
తాజా అంచనాల ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే దాదాపు 36 లక్షల కుటుంబాలు నివసిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది కొన్ని చిన్న రాష్ట్రాల మొత్తం కుటుంబాల కంటే ఎక్కువగా ఉండటం విశేషం. జిల్లాల వారీగా ఉమ్మడి నల్గొండ జిల్లా 10.43 లక్షల కుటుంబాలతో అగ్రస్థానంలో ఉండగా, మంచిర్యాల జిల్లాలో అత్యల్పంగా 60 వేల కుటుంబాలు ఉన్నట్లు సమాచారం. అధికారిక జనగణన ఫలితాలు 2027 చివరి నాటికి వెలువడే అవకాశం ఉంది.
Fetching videos...
Fetching latest news...
No trending news