ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా మరోసారి భారీ స్థాయిలో క్షిపణులు, డ్రోన్లతో దాడులకు పాల్పడింది. గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ దాడులతో నగరంలోని పలు ప్రాంతాలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. వరుస పేలుళ్లు, గగనతల హెచ్చరిక సైరన్లు, మంటలు చెలరేగడంతో కీవ్ నగర ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఈ దాడుల్లో కనీసం ఐదుగురు గాయపడినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. పలు భవనాలు, మౌలిక సదుపాయాలు కూడా దెబ్బతిన్నట్లు సమాచారం.
ఈ దాడులకు కొన్ని గంటల ముందే ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ కీలక హెచ్చరిక జారీ చేశారు. రష్యా పెద్ద ఎత్తున దాడులకు సిద్ధమవుతోందని, దేశవ్యాప్తంగా అప్రమత్తంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. జెలెన్స్కీ చేసిన హెచ్చరిక వెలువడిన కొద్ది గంటలకే కీవ్‌పై జరిగిన ఈ దాడులు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాయి. దీంతో రష్యా యుద్ధ వ్యూహంలో కొత్త దశ ప్రారంభమైందా అనే చర్చలు కూడా మొదలయ్యాయి.
స్థానిక నివేదికల ప్రకారం, రష్యా సైన్యం ఒకేసారి అనేక డ్రోన్లు మరియు క్షిపణులను ప్రయోగించింది. వీటిలో కొన్ని లక్ష్యాలను చేరుకోగా, మరికొన్నింటిని ఉక్రెయిన్ వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయి. అయినప్పటికీ కొన్ని శకలాలు భవనాలపై పడటంతో మంటలు చెలరేగాయి. అత్యవసర సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి అగ్నిమాపక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు
Fetching videos...
Fetching latest news...
No trending news