తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోల రాజకీయ ప్రవేశంపై జరుగుతున్న చర్చ మరోసారి వేడెక్కింది. ఇటీవల దళపతి విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత, కోలీవుడ్లో ఇతర ప్రముఖ హీరోలపై కూడా రాజకీయ ఊహాగానాలు పెరిగాయి. ఈ క్రమంలో నటుడు సూర్య కూడా రాజకీయాల్లోకి వెళ్తున్నారంటూ సోషల్ మీడియాలో, కొన్ని మీడియా వర్గాల్లో వార్తలు వైరల్ కావడం పెద్ద చర్చకు దారితీసింది.
సూర్య ఇప్పటికే సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లో మంచి గుర్తింపు పొందారు. గరం ఫౌండేషన్ ద్వారా విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో అనేక సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అలాగే తన అభిమాన సంఘాలతో కలిసి కూడా పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యమే ఆయన రాజకీయాల్లోకి రావడానికి సిద్ధమవుతున్నారనే ఊహాగానాలకు కారణమైంది.
ఇటీవల చెన్నైలో జరిగిన అభిమాన సంఘ సమావేశంలో సూర్య రాజకీయ ప్రవేశంపై కొన్ని వ్యాఖ్యలు వెలువడ్డాయి. ఆ సమావేశంలో పాల్గొన్న ఆర్. వీరమణి మాట్లాడుతూ సూర్య త్వరలో రాజకీయాల్లోకి రావడం ఖాయమని వ్యాఖ్యానించడంతో ఆ మాటలు కాస్తా మీడియా వర్గాల్లో పెద్ద వార్తగా మారాయి. ఆ వ్యాఖ్యలను ఆధారంగా చేసుకుని పలు మీడియా సంస్థలు సూర్య రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని కథనాలు ప్రసారం చేశాయి.
ఈ వార్తలు వేగంగా సోషల్ మీడియాలో వ్యాపించడంతో అభిమానుల్లో కూడా గందరగోళం నెలకొంది. సూర్య రాజకీయ భవిష్యత్తుపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. అయితే ఈ ఊహాగానాలకు సూర్య టీమ్ వెంటనే స్పందించింది. సూర్యకు రాజకీయాల్లోకి వెళ్లాలనే ఎలాంటి ఆలోచన లేదని స్పష్టంగా ప్రకటించింది.
సూర్య టీమ్ ప్రకటనలో, వీరమణి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగత అభిప్రాయమని, వాటికి సూర్యతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఆయన ప్రస్తుతం పూర్తిగా సినిమాలు మరియు సామాజిక సేవా కార్యక్రమాలపైనే దృష్టి పెట్టారని తెలిపింది. ప్రజలకు సహాయం చేయడం, విద్యార్థులకు మద్దతు ఇవ్వడం వంటి సేవా కార్యక్రమాలే తన ప్రధాన లక్ష్యమని, రాజకీయాల్లోకి వెళ్లే ఉద్దేశం లేదని క్లారిటీ ఇచ్చింది.
తమిళనాట ఇప్పటికే సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వెళ్లిన అనేక ఉదాహరణలు ఉన్న నేపథ్యంలో, స్టార్ హీరోలపై ఇలాంటి వార్తలు తరచుగా వస్తుంటాయి. కానీ ప్రతి సారి అవి నిజం కాకపోవడం కూడా చూస్తూనే ఉన్నాం. సూర్య విషయంలో కూడా అదే పరిస్థితి స్పష్టమైంది.
ప్రస్తుతం సూర్య సినిమాల విషయంలో బిజీగా ఉన్నారు. వరుస ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. అదే సమయంలో తన ఫౌండేషన్ ద్వారా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఈ దశలో రాజకీయ ప్రవేశం గురించి వచ్చిన వార్తలు కేవలం ఊహాగానాలేనని స్పష్టమవుతోంది.
మొత్తానికి సూర్య రాజకీయాల్లోకి వస్తున్నారని వచ్చిన వార్తలకు ఆయన టీమ్ చెక్ పెట్టడంతో ఈ చర్చకు తాత్కాలికంగా ముగింపు పడినట్లైంది.
Fetching videos...
Fetching latest news...
No trending news