అమెరికా మరియు ఇరాన్ మధ్య కొనసాగుతున్న పరోక్ష చర్చలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో అమెరికా సంబంధాలు ప్రస్తుతం చాలా సానుకూల దిశగా సాగుతున్నాయని ఆయన తెలిపారు. ఇటీవల ఖతార్‌లో జరిగిన పరోక్ష చర్చలు మంచి వాతావరణంలో జరిగాయని, ఇరాన్ అణు నిరాయుధీకరణ ప్రక్రియ కూడా బాగా ముందుకు సాగుతోందని ట్రంప్ పేర్కొన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
రిపోర్టర్లతో మాట్లాడిన ట్రంప్, ఇరాన్‌తో సంబంధాలు మెరుగుపడుతున్నాయనే సంకేతాలు ఇచ్చారు. “ఇరాన్ అణు నిరాయుధీకరణ బాగా ముందుకు సాగుతోంది. వాళ్లతో చాలా మంచి సమావేశాలు జరిగాయి. ఇక ఏమవుతుందో చూడాలి” అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా “మేము ఇరాన్‌తో చాలా బాగా కలిసిపోతున్నాం. వాళ్లు చాలా దూరం ముందుకు వచ్చారు” అని కూడా ట్రంప్ తెలిపారు. ఈ వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు కొంత తగ్గే అవకాశముందన్న ఆశలను పెంచాయి
అమెరికా మరియు ఇరాన్ మధ్య గత అనేక సంవత్సరాలుగా అణు కార్యక్రమం, ఆంక్షలు, ప్రాంతీయ భద్రత, మధ్యప్రాచ్య రాజకీయాలపై తీవ్ర విభేదాలు కొనసాగుతున్నాయి. ఇరాన్ తన అణు కార్యక్రమం శాంతి ప్రయోజనాల కోసమేనని చెబుతుండగా, అమెరికా సహా పాశ్చాత్య దేశాలు ఇరాన్ అణు సామర్థ్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య చర్చలు పునరుద్ధరించబడటం ఒక ముఖ్యమైన పరిణామంగా భావిస్తున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news