వాట్సాప్‌లో యూజర్‌నేమ్ ఫీచర్‌ను ప్రవేశపెట్టాలన్న మెటా నిర్ణయంపై భారత్ ప్రభుత్వం తాత్కాలికంగా బ్రేక్ వేసిన నేపథ్యంలో ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. యూజర్‌నేమ్ ఫీచర్ భద్రత, గోప్యత, మోసాల నివారణ వంటి అంశాలపై స్పష్టత వచ్చే వరకు ఈ ఫీచర్‌ను భారత్‌లో అమలు చేయవద్దని కేంద్ర ప్రభుత్వం సూచించింది. దీనిపై స్పందించిన వాట్సాప్, ఈ ఫీచర్ ఇప్పటికీ ప్రత్యక్షంగా అందుబాటులోకి రాలేదని, దశలవారీగా ఈ ఏడాది చివర్లో మాత్రమే విడుదల చేస్తామని స్పష్టం చేసింది ప్రస్తుతం వాట్సాప్‌లో ప్రతి ఖాతా మొబైల్ నంబర్ ఆధారంగా పనిచేస్తోంది. కొత్త యూజర్‌నేమ్ ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ ఫోన్ నంబర్‌ను ఇతరులకు తెలియజేయకుండా ప్రత్యేక పేరుతో సంభాషించే అవకాశం కల్పించాలన్నది మెటా లక్ష్యం. ఈ విధానం గోప్యతను మెరుగుపరుస్తుందని సంస్థ చెబుతోంది. అయితే ఇదే ఫీచర్‌ను మోసగాళ్లు నకిలీ పేర్లతో దుర్వినియోగం చేసే అవకాశం ఉందనే ఆందోళనలను కేంద్ర ప్రభుత్వం వ్యక్తం చేసింది
ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మెటాకు అధికారిక నోటీసు పంపింది. యూజర్‌నేమ్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, వినియోగదారుల భద్రతకు ఎలాంటి రక్షణ చర్యలు ఉన్నాయి, మోసాలను ఎలా అరికడతారు అనే అంశాలపై పూర్తి వివరాలు సమర్పించాలని కోరింది. అంతేకాకుండా ప్రభుత్వం సంతృప్తి చెందే వరకు ఈ ఫీచర్‌ను భారత్‌లో అమలు చేయవద్దని సూచించింది. దీనికి సంబంధించి మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని కూడా మెటాను ఆదేశించినట్లు సమాచారం.
ఈ వివాదంపై వాట్సాప్ స్పందిస్తూ ఒక కీలక విషయాన్ని స్పష్టం చేసింది. యూజర్‌నేమ్ ఫీచర్‌ను కేవలం ప్రకటించామని, ప్రస్తుతం వినియోగదారులకు అందుబాటులో లేదని తెలిపింది. ఈ ఫీచర్‌ను దశలవారీగా విడుదల చేస్తామని, భద్రతా ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని అమలు చేస్తామని వెల్లడించింది. అంతేకాకుండా యూజర్‌నేమ్ ఉపయోగించడం పూర్తిగా ఐచ్ఛికమని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా దీనిని ఉపయోగించాల్సిన అవసరం లేదని పేర్కొంది
Fetching videos...
Fetching latest news...
No trending news