మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. ఈ కేసులో భాగంగా మరో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. పంజాబ్లోని పఠాన్కోట్, బీహార్లోని సమస్తిపూర్ ప్రాంతాల్లో నిర్వహించిన ప్రత్యేక చర్యల్లో ఈ అరెస్టులు జరిగినట్లు సమాచారం. దీంతో ఇప్పటివరకు ఈ కేసులో అరెస్టైన వారి సంఖ్య ఏడుకు చేరుకుంది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష వంటి కీలక నియామక పరీక్షలో ప్రశ్నపత్రం లీక్ కావడం విద్యార్థులు, నిరుద్యోగుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది. వేలాది మంది అభ్యర్థులు కష్టపడి పరీక్షలకు సిద్ధమవుతుండగా, అక్రమ మార్గాల్లో ప్రశ్నపత్రాలు బయటకు రావడం పరీక్షల విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి కేసును లోతుగా విచారిస్తోంది దర్యాప్తు సంస్థల వివరాల ప్రకారం, ప్రశ్నపత్రం లీక్ వెనుక విస్తృత స్థాయి ముఠా పనిచేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో ఉన్న వ్యక్తులు పరస్పరం సమన్వయం చేసుకుంటూ అక్రమంగా ప్రశ్నపత్రాలను సేకరించి కొందరు అభ్యర్థులకు అందించినట్లు విచారణలో వెలుగులోకి వస్తోంది. ఆర్థిక లావాదేవీలు, సమాచార మార్పిడి, అనుమానితుల సంబంధాలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు.
తాజాగా అరెస్టైన ముగ్గురు నిందితులను విచారించడం ద్వారా మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే అరెస్టైన వ్యక్తుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా మరికొందరిని గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఈ వ్యవహారానికి ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న వ్యక్తిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు పలు రాష్ట్రాల్లో గాలింపు చర్యలు చేపట్టాయి.
Fetching videos...
Fetching latest news...
No trending news