1920లలో అమెరికాలో జరిగిన ఒక సంఘటన ప్రపంచ పర్యావరణ పరిరక్షణ చరిత్రలో కీలక మలుపుగా నిలిచింది. అరిజోనా రాష్ట్రంలోని పర్వత ప్రాంతంలో ఒక వేట యాత్ర సందర్భంగా యేల్ విశ్వవిద్యాలయంలో అటవీ శాస్త్రంలో శిక్షణ పొందిన అటవీ అధికారి ఆల్డో లియోపోల్డ్ ఒక తోడేలును కాల్చి చంపారు. అయితే ఆ ఘటన తర్వాత ఆయన చూసిన దృశ్యం ఆయన ఆలోచనా విధానాన్నే పూర్తిగా మార్చేసింది. ఆ అనుభవమే తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి పరిరక్షణ, జీవ వైవిధ్య సంరక్షణకు కొత్త దృక్పథానికి పునాది వేసింది. ఒక రోజు అరిజోనాలోని పర్వత ప్రాంతంలో సహచరులతో కలిసి వేటకు వెళ్లిన సమయంలో వారు తోడేళ్ల గుంపును గుర్తించారు. వెంటనే కాల్పులు జరపగా ఒక ఆడ తోడేలు తీవ్రంగా గాయపడింది. దాని వద్దకు వెళ్లిన లియోపోల్డ్ ఆ జంతువు చివరి క్షణాలను దగ్గరగా చూశారు. తన ప్రసిద్ధ రచనల్లో ఆయన ఆ క్షణాన్ని "ఆ తోడేలు కళ్లలో పచ్చని మంట నెమ్మదిగా ఆరిపోతున్నట్లు చూశాను" అని వర్ణించారు. ఆ దృశ్యం ఆయన మనసుపై గాఢమైన ప్రభావం చూపింది.
ఆ సంఘటన తర్వాత లియోపోల్డ్ ప్రకృతిని పూర్తిగా కొత్త కోణంలో అర్థం చేసుకోవడం ప్రారంభించారు. తోడేళ్లు కేవలం మాంసాహార జంతువులు మాత్రమే కాకుండా, అడవి పర్యావరణ సమతుల్యతను కాపాడే కీలక భాగమని ఆయన గ్రహించారు. తోడేళ్లు లేకపోతే జింకల సంఖ్య అదుపు తప్పి పెరుగుతుందని, అవి అధికంగా మొక్కలను మేయడం వల్ల అడవులు దెబ్బతింటాయని, చివరకు మొత్తం జీవావరణ వ్యవస్థ అసమతుల్యంగా మారుతుందని ఆయన గుర్తించారు.Fetching videos...
Fetching latest news...
No trending news