సౌర కుటుంబంలోని సూర్యుడికి అత్యంత సమీప గ్రహమైన బుధుడు (మెర్క్యురీ) గురించి మరింత లోతైన సమాచారాన్ని సేకరించేందుకు చేపట్టిన బెపికొలంబో (BepiColombo) అంతరిక్ష మిషన్ కీలక దశకు చేరుకుంది. దాదాపు ఎనిమిదేళ్ల పాటు అంతరిక్షంలో ప్రయాణించిన ఈ వ్యోమనౌక, బుధుడి కక్ష్యలోకి ప్రవేశించేందుకు చివరి దశలో ఉంది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA), జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ (JAXA) సంయుక్తంగా చేపట్టిన ఈ మిషన్ అంతరిక్ష పరిశోధనలో అత్యంత క్లిష్టమైన కార్యక్రమాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. బెపికొలంబోను 2018 అక్టోబర్ 20న ఫ్రెంచ్ గయానాలోని కౌరౌ అంతరిక్ష కేంద్రం నుంచి విజయవంతంగా ప్రయోగించారు. సూర్యుడికి అత్యంత సమీపంలో ఉన్న బుధుడి కక్ష్యలోకి నేరుగా చేరడం సాధ్యం కాకపోవడంతో ఈ మిషన్ ప్రత్యేకమైన మార్గాన్ని ఎంచుకుంది. భూమి, శుక్రుడు, బుధుడు గ్రహాల గురుత్వాకర్షణ శక్తిని ఉపయోగించుకుంటూ వ్యోమనౌక తన వేగాన్ని క్రమంగా తగ్గించుకుంటూ ప్రయాణించింది. ఈ విధానాన్ని గ్రావిటీ అసిస్ట్ అని పిలుస్తారు. ఈ పద్ధతి వల్ల ఇంధన వినియోగాన్ని గణనీయంగా తగ్గించగలిగారు.మైనస్ 180 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోతాయి. ఇలాంటి తీవ్రమైన ఉష్ణోగ్రతలను తట్టుకునేలా బెపికొలంబోకు ప్రత్యేకమైన హీట్ షీల్డ్లు, అధునాతన సాంకేతిక పరికరాలను అమర్చారు. అంతరిక్షంలో సూర్యుని నుంచి వచ్చే తీవ్రమైన వికిరణాన్ని కూడా ఈ వ్యోమనౌక తట్టుకునేలా రూపొందించారు.
Fetching videos...
Fetching latest news...
No trending news