అంతర్జాతీయ పాప్ స్టార్ టేలర్ స్విఫ్ట్ మరియు అమెరికన్ ఫుట్‌బాల్ స్టార్ ట్రావిస్ కెల్సీ వివాహానికి సంబంధించిన ఊహాగానాలు మరోసారి జోరందుకున్నాయి. న్యూయార్క్ నగరంలోని ప్రముఖ మ్యాడిసన్ స్క్వేర్ గార్డెన్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం ఈ చర్చలకు మరింత ఊతమిచ్చింది. ఈ వేడుకలో హాలీవుడ్, సంగీత రంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరుకావడంతో, ఇది పెళ్లికి ముందు నిర్వహించే ప్రత్యేక వేడుక లేదా రిహార్సల్ డిన్నర్ కావచ్చని అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రచారం చేస్తున్నాయి. అయితే, ఇప్పటివరకు టేలర్ స్విఫ్ట్ లేదా ట్రావిస్ కెల్సీ తమ వివాహంపై అధికారిక ప్రకటన చేయలేదు.
గురువారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమానికి సుమారు వందమంది ప్రత్యేక అతిథులు హాజరైనట్లు సమాచారం. నల్లరంగు లగ్జరీ ఎస్యూవీ వాహనాల్లో ప్రముఖులు వరుసగా వేదికకు చేరుకున్నారు. అతిథుల కోసం ప్రత్యేకంగా తెల్లటి క్యానపీ ఏర్పాటు చేయడంతో కార్యక్రమం అత్యంత గోప్యంగా నిర్వహించినట్లు తెలుస్తోంది. భద్రతా ఏర్పాట్లు కూడా అత్యంత కట్టుదిట్టంగా ఉండటంతో మీడియాకు పరిమిత అవకాశాలే లభించాయి.
ఈ కార్యక్రమానికి ప్రముఖ నటి లీనా డన్హామ్, సంగీత నిర్మాత జాక్ ఆంటోనాఫ్ సహా టేలర్ స్విఫ్ట్‌కు అత్యంత సన్నిహితులైన పలువురు హాజరయ్యారు. జాక్ ఆంటోనాఫ్ టేలర్ స్విఫ్ట్‌తో అనేక విజయవంతమైన సంగీత ఆల్బమ్‌లకు కలిసి పనిచేసిన సంగతి తెలిసిందే. వీరి హాజరు ఈ కార్యక్రమం సాధారణ వేడుక కాదనే ఊహాగానాలకు బలం చేకూర్చింది
Fetching videos...
Fetching latest news...
No trending news